Woman Beheaded, Chopped | కోరిక తీర్చలేదని.. మహిళను హత్య చేసి మూడు ముక్కలుగా నరికిన వ్యక్తి
Woman Beheaded, Chopped | లైంగిక కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఆమె తల నరకడంతోపాటు మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోశాడు. శరీర భాగాలను పలుచోట్ల పడేశాడు. తెగిన తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కోల్‌కతా: లైంగిక కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఆమె తల నరకడంతోపాటు మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోశాడు. (Woman Beheaded, Chopped) శరీర భాగాలను పలుచోట్ల పడేశాడు. తెగిన తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్యాప్తు చేసి చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం రీజెంట్ పార్క్ ప్రాంతంలో తెగిన మహిళ తల పాలిథిన్ బ్యాగ్‌లో ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే శనివారం చెరువు సమీపంలో మహిళ మొండెం, దిగువ భాగాన్ని పోలీసులు కనుగొన్నారు.
కాగా, ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 35 ఏళ్ల అతిఉర్ రెహమాన్ లస్కర్ నిందితుడిగా గుర్తించారు. సొంతూరుకు పారిపోయిన అతడ్ని అరెస్ట్ చేశారు. లస్కర్‌ను ప్రశ్నించగా లైంగిక కోరిక తీర్చనందుకు ఆ మహిళను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు రెండేళ్ల కిందట భర్తను వీడిన 30 ఏళ్ల మహిళ కూలీగా పని చేస్తున్నదని పోలీసులు తెలిపారు. బావ వరుసైన లస్కర్‌తో కలిసి రోజూ పనికి వెళ్లేదని చెప్పారు. అయితే తన కోరిక తీర్చాలని అతడు వేధిస్తుండటంతో అతడి మొబైల్ నంబర్‌ను ఆమె బ్లాక్ చేసిందని అన్నారు. ఆ మహిళ తిరస్కరణ అతడికి కోపం తెప్పించిందని వెల్లడించారు.
కాగా, డిసెంబర్ 12న గురువారం సాయంత్రం పని ముగిసిన తర్వాత నిర్మాణంలో ఉన్న భవనంలోకి రావాలని ఆ మహిళను లస్కర్ బలవంతం చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అక్కడ ప్రతిఘటించిన ఆమె గొంతు నొక్కి హత్య చేశాడని చెప్పాడు. ఆ తర్వాత మహిళ తల నరకడంతోపాటు శరీరాన్ని మూడు భాగాలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడని వివరించారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

