labourers stripped, beaten | బెంగాల్ కూలీలపై ఒడిశాలో దాడి.. బట్టలిప్పించి కొట్టి ఊరేగించిన గుంపు
labourers stripped, beaten | పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు కూలీలపై ఒడిశాలో దాడి జరిగింది. ఒక గుంపు వారితో బలవంతంగా బట్టలు విప్పించారు. మహిళ పట్ల అసభ్య ప్రవర్తనపై కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అర్ధ నగ్నంగా ఊరేగించారు.
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు కూలీలపై ఒడిశాలో దాడి జరిగింది. ఒక గుంపు వారితో బలవంతంగా బట్టలు విప్పించారు. మహిళ పట్ల అసభ్య ప్రవర్తనపై కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అర్ధ నగ్నంగా ఊరేగించారు. (labourers stripped, beaten) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెంగాల్‌కు చెందిన ఎనిమిది మంది వలస కూలీలు ఒక గ్రామంలో నివసిస్తున్నారు.
కాగా, ఒక కూలీ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని గ్రామానికి చెందిన మహిళ ఆరోపించింది. దీంతో ఆమె వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు 8 మంది బెంగాల్ కూలీలను చుట్టుముట్టారు. బలవంతంగా వారితో దుస్తులు విప్పించారు. తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అర్ధ నగ్నంగా ఆ గ్రామంలో ఊరేగించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గుంపు చెర నుంచి బెంగాల్ కూలీలను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారి నుంచి ప్రతిఘటన ఎదురైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

