రేపు లేదా ఎల్లుండి ఆర్యన్ ఖాన్ విడుదల: ముకుల్ రోహత్గీ
Mukul Rohatgi: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన ఆర్యన్‌ఖాన్ రేపు లేదా ఎల్లుండి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నదని

ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన ఆర్యన్‌ఖాన్ రేపు లేదా ఎల్లుండి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నదని భారత మాజీ అటార్ని జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున ముకుల్ రోహత్గీనే వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ముకుల్ రోహత్గీ.. మూడు రోజుల వాదనల అనంతరం కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసిందన్నారు.
ఆర్యన్‌ఖాన్‌తోపాటు ఆర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. బెయిల్‌కు సంబంధించి కోర్టు శుక్రవారం సంపూర్ణ ఆదేశాలను రేపు ఇస్తుందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు రేపుగానీ లేదా ఎల్లుండిగానీ ఆ ముగ్గురిని విడుదల చేసే అవకాశం ఉన్నదన్నారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే వాళ్లు జైలు నుంచి బయటికి వస్తారని చెప్పారు. కేసు గెలువడం, ఓడటం అనేది నాకు సాధారణమేనన్నారు. ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరకడం సంతోషంగా ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Aryan Khan
- bail
- Mukul Rohatgi
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

