3 Arrested In Kerala | రష్యా ఆర్మీలో చేరి మరణించిన కేరళ వ్యక్తి.. ముగ్గురు అరెస్ట్
3 Arrested In Kerala | కేరళకు చెందిన వ్యక్తి రష్యా ఆర్మీలో చేరాడు. ఉక్రెయిన్ యుద్ధంలో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి మరణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరువనంతపురం: కేరళకు చెందిన వ్యక్తి రష్యా ఆర్మీలో చేరాడు. ఉక్రెయిన్ యుద్ధంలో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి మరణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (3 Arrested In Kerala) 32 ఏళ్ల బినిల్, 27 ఏళ్ల జైన్ ఐటిఐ మెకానికల్ డిప్లొమా చదివారు. బంధువులైన వారిద్దరూ ఎలక్ట్రీషియన్, ప్లంబర్లుగా పని చేసేందుకు గత ఏడాది ఏప్రిల్ 4న రష్యా వెళ్లారు. అయితే వారి పాస్‌పోర్ట్‌లను రష్యా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్‌లో భాగంగా ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వారిని పంపారు. జనవరి 13న వార్‌లో బినిల్ మరణించగా, జైన్ తీవ్రంగా గాయపడ్డాడు. మాస్కోలోని ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.
కాగా, అధిక జీతం ఇచ్చే ఉద్యోగాల పేరుతో బినిల్, జైన్‌ను కొందరు ఏజెంట్లు అక్రమంగా రష్యా పంపినట్లు మృతుడి భార్య, గాయపడిన వ్యక్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో త్రిసూర్‌కు చెందిన సందీప్ థామస్, సుమేష్ ఆంటోనీ, సీబీలను పోలీసులు విచారించారు. బినిల్, జైన్ రష్యాకు వెళ్లడం వెనుక వారి ప్రమేయం ఉందని తేల్చారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇమిగ్రేషన్ చట్టం, మానవ అక్రమ రవాణా, మోసం కింద వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

