Gang Rape | ఒక వ్యక్తిని కొట్టిన ఐదుగురు.. అతడి భార్యపై సామూహిక లైంగిక దాడి
Gang Rape | బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. భర్తను దారుణంగా కొట్టారు. భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
భువనేశ్వర్: బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. భర్తను దారుణంగా కొట్టారు. భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Gang Rape) ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలు జాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన వారు. అయితే చదువుకోసం భార్య భుబన్ ప్రాంతంలో ఉంటున్నది. అక్టోబర్ 21న ఆ వ్యక్తి తన భార్యను కలిశాడు. ఆ జంట బైక్‌పై తమ సొంతూరు బయలుదేరారు.
కాగా, సాయంత్రం సమయంలో ఐదుగురు వ్యక్తులు వారి బైక్‌ను అడ్డుకున్నారు. భర్తకు చెందిన మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఆ వ్యక్తి భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులు, వారు వినియోగించిన వాహనాలను గుర్తించడంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

