మాస్కో, డిసెంబర్ 24: రష్యాలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది దుర్మరణం చెందారు. సైబీరియాలోని కెమెరోవోలో అక్రమంగా నిర్మించిన నర్సింగ్ హోంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదని చెప్పారు. వెచ్చదనం కోసం ఏర్పాటుచేసిన హీటింగ్ స్టవ్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు.