Fire At Income Tax Office | ఆదాయపు పన్ను కార్యాలయం భవనంలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న ఉద్యోగులు
Fire At Income Tax Office | ఆదాయపు పన్ను కార్యాలయం భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బేస్మెంట్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు.
ముంబై: ఆదాయపు పన్ను కార్యాలయం భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బేస్మెంట్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు. (Fire At Income Tax Office) ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడంతో పాటు ఆ ఉద్యోగులను రక్షించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చర్చిగేట్ ప్రాంతంలోని మహర్షి కర్వే రోడ్డులో ఉన్న ఇన్‌కమ్‌టాక్స్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఏడు అంతస్తులున్న ఈ బిల్డింగ్‌లోని బేస్మెంట్, ఫస్ట్ ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు.
కాగా, ఈ అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర వాహనాలతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక బృందం మంటలు ఆర్పడంలో నిమగ్నం కాగా, పై అంతస్తుల్లో చిక్కుకున్న ఉద్యోగులను మరో టీం రక్షించింది. నిచ్చెనల ద్వారా పైకి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మరోవైపు ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరుగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను కార్యాలయంలో అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫైర్ అధికారులు వెల్లడించారు.
Mumbai, Maharashtra: A fire broke out at the Income Tax building in Churchgate. Four fire engines reached the spot, and firefighting operations are underway pic.twitter.com/aESlB9t6R9
— IANS (@ians_india) August 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

