Bokaro steel plant | స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. 21 మంది కార్మికులు ఆసుపత్రిపాలు
Bokaro steel plant | స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగల్లో చిక్కుకున్న సుమారు 21 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాంచి: స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగల్లో చిక్కుకున్న సుమారు 21 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Bokaro steel plant) జార్ఖండ్ రాష్ట్రం బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ప్లాంట్‌లో ఈ సంఘటన జరిగింది. స్టీల్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సుమారు 21 మంది కార్మికులు ఆసుపత్రిపాలయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
కాగా, నిర్వహణ పనులు చేస్తుండగా గ్యాస్ పైప్‌లైన్ పేలడంతో మంటలు చెలరేగాయని స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ అలారం మోగడంతో కార్మికులంతా ప్లాంట్ నుంచి బయటకు వెళ్లారని చెప్పారు. పైప్‌లైన్ నుంచి ఎలాంటి గ్యాస్ లీకేజీ జరుగలేదని అన్నారు. మంటలను అదుపు చేశామని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని స్టీల్ ప్లాంట్ అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన 21 మంది కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

