భజరంగ్ దళ్ లీడర్ సహా 100 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు
Karnataka | కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్‌ను దూషించిన కేసులో భజరంగ్ దళ్ లీడర్ సహా 100 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఏడాది అక్టోబర్ 17న హుబ్లీలో మత మార్పిడిలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ లీడర్ అశోక్

బెంగళూరు : కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్‌ను దూషించిన కేసులో భజరంగ్ దళ్ లీడర్ సహా 100 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఏడాది అక్టోబర్ 17న హుబ్లీలో మత మార్పిడిలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ లీడర్ అశోక్ అన్వేకర్, ఆయన మద్దతుదారులు కలిసి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. హుబ్లీలో మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్న వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్న వారికి ఐపీఎస్ ఆఫీసర్ కే రామరాజన్ మద్దతు ఇస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. రామరాజన్ దేశ ద్రోహి అని దూషించారు. ఐపీఎస్ ఆఫీసర్‌ను ఇక్కడ్నుంచి బదిలీ చేయకపోతే పోలీసు కమిషనర్ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
అయితే ఐపీఎస్ ఆఫీసర్ రామరాజన్‌ను దూషించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భజరంగ్ దళ్ లీడర్ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భజరంగ్ దళ్ లీడర్ సహా 100 మందిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

