ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన దేశం ఫిన్లాండ్ అని తేలింది. యూనిసెఫ్ నిర్వహించిన సర్వేలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇలా మొదటి స్థానం సంపాదించుకోవడం ఇదేం కొత్త కాదు. వరుసగా ఇది ఐదో సారి. మొత్తం 146 దేశాల జాబితా రూపొందిస్తే.. ఫిన్లాండ్ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఇక భారత్ స్థానం 136 స్థానంలో నిలబడింది. గత పదేళ్లుగా ప్రపంచంలోని ఆనంద దేశాల జాబితా రూపొందిస్తున్నారు. ఆనందం, ప్రజల ఆర్థిక, సామాజిక డేటాతో ప్రజల సొంత అంచనాలపై ఆధారపడి ఈ సర్వే చేస్తున్నారు.
ఇక ఈ జాబితాలో తాలిబాన్లు రాజ్యమేలుతున్న ఆఫ్గనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆఫ్గన్ కన్నా పైన జింబాబ్వే, లెబనాన్ దేశాలున్నాయి. అయితే సెర్బియా, బల్గేరియా, రొమేనియా గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఇక అమెరికా 16 వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే మూడు స్థానాలు మెరుగైంది. ఇక బ్రిటన్ 17 వ స్థానం, ఫ్రాన్స్ 20 వ స్థానానికి చేరిపోయింది. ఇక చైనా గతంలో 19 వ స్థానంలో ఉండగా… ఇప్పుడు ఏకంగా 72 వ స్థానానికి పడిపోయింది.