Helmet | కారు నడుపుతున్నారా.. అయితే హెల్మెట్ పెట్టుకోండి.. లేకుంటే వెయ్యి ఫైన్!
హెల్మెట్ ధరించకుండా కారు నడిపాడని యూపీలోని నోయిడా పోలీసులు జరిమానా విధించారు. బాధితుడు తుషార్ సక్సేనా మాట్లాడుతూ రూ.1,000 జరిమానా చెల్లించాలని గత ఏడాది నవంబరులో మెసేజ్ వచ్చిందని, అది పొరపాటున వచ్చిందేమోనని తాను పట్టించుకోలేదన్నారు.
Helmet | లక్నో: హెల్మెట్ ధరించకుండా కారు నడిపాడని యూపీలోని నోయిడా పోలీసులు జరిమానా విధించారు. బాధితుడు తుషార్ సక్సేనా మాట్లాడుతూ రూ.1,000 జరిమానా చెల్లించాలని గత ఏడాది నవంబరులో మెసేజ్ వచ్చిందని, అది పొరపాటున వచ్చిందేమోనని తాను పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత ఈ-మెయిల్, మెసేజ్‌లు రావడంతో పోలీసులను సంప్రదించానన్నారు.
జరిమానా చెల్లించకపోతే కోర్టుకు రావలసి ఉంటుందని పోలీసులు తనను హెచ్చరించారని చెప్పారు. కారును నడిపేటపుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంటే, అధికారులు లిఖితపూర్వకంగా తనకు ఇవ్వాలని కోరారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వలేదని భర్తపై కేసు..
బెంగళూరు: తనను కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వటం లేదు, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటూ బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు 498ఏ, సెక్షన్-504 (ఉద్దేశపూర్వక అవమానం), వరకట్న నిషేధ చట్టం కింద కేసులు పెట్టారు. భర్త హైకోర్టును ఆశ్రయించటంతో దర్యాప్తును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లేందుకు అతడికి అనుమతించింది. తదుపరి విచారణకు అందుబాటులో ఉంటానని అతడు అఫిడవిట్ దాఖలు చేశాడు. సరైన ఆధారాల్లేకుండా 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టారని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

