PUC Certificate | నో పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని ఈవీకి జరిమానా!
PUC Certificate | రాజస్థాన్లోని నాగౌర్లో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇటీవల ఒక విద్యుత్తు కారుకు కాలుష్య నియం త్రణ ధ్రువీకరణ పత్రం లేదని జరిమానా విధించారు.
PUC Certificate | జైపూర్: రాజస్థాన్లోని నాగౌర్లో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇటీవల ఒక విద్యుత్తు కారుకు కాలుష్య నియం త్రణ ధ్రువీకరణ పత్రం లేదని జరిమానా విధించారు. ఇదేమి చోద్యమని నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పోలీస్ శాఖ స్పందించి.. దీనిపై దర్యాప్తు జరిపి సదరు జరిమానాను రద్దు చేస్తామని పేర్కొన్నది.
ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ టాటా టియాగో ఈవీ కారుకు విండ్షీల్డ్ షేడ్స్ లేవని ఓ ఏఎస్సై ఆ కారును ఆపి రూ.200 జరిమానాగా విధించారు. అయితే వాహన కాలుష్యం నియంత్రణలో ఉందని తెలిపే పీయూసీ సర్టిఫికెట్ లేదనే కారణంతో రూ.1,500 జరిమానా అదనం గా విధించారు. తనది విద్యుత్తు కారని.. దానికి ఆ ధ్రువీక రణ పత్రం అవసరం లేదని కారు యజమాని వాదించినా ఏఎస్సై వినిపించుకోలేదు. అయితే దీనిపై రాజస్థాన్ పోలీస్ విభాగం స్పందిస్తూ.. ఆ జరిమానా పొరబాటున జారీ అయ్యి ఉండొచ్చని తెలిపింది. కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు, 1989 ప్రకారం విద్యుత్తు వాహనాలకు కాలు ష్య నియంత్రణ తనిఖీల నుంచి మినహాయింపు ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

