తిరువనంతపురం: ఆపరేషన్ థియేటర్లో పొడువైన స్లీవ్ జాకెట్లను ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి చెందిన ఏడు మంది మహిళా విద్యార్థిను(Female Medicos)లు డిమాండ్ చేశారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌కు వాళ్లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశాన్ని తేల్చేందుకు సర్జన్లు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ బృందాలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
మతపరమైన విశ్వాసాల ప్రకారం తమ తలను ఎప్పటికీ కప్పుకుని ఉండాలని, ఆపరేషన్ థియేటర్ లోపల హిజాబ్‌ను ధరించడం వీలు కాదు అని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు మహిళా విద్యార్థినులు తమ వినతిపత్రంలో తెలిపారు. జూన్ 26వ తేదీన ఆ కాలేజీని ప్రిన్సిపాల్‌కు ఆ వినతి అందినట్లు తెలుస్తోంది. పొడువైన జాకెట్లను ధరించడం వల్ల ఆపరేషన్ థియేటర్లో ప్రతిసారి స్టెరిలైజ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. కానీ మహిళా స్టూడెంట్ల ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు.