Genitals Chopped: బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్టర్
Genitals Chopped: అయిదేళ్లుగా రిలేషన్లో ఉంది. పెళ్లి చేసుకోమంటే ఆ కౌన్సిలర్ చేసుకోవడం లేదు. రిజిస్టర్ మ్యారేజీ కూడా వద్దన్నాడు. దీంతో విరక్తి చెందిన లేడీ డాక్టర్, తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి రమ్మన్నది. బెడ్ మీదే అతన్ని పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.
పాట్నా: బీహార్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది(Genitals Chopped). సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యా యత్నం కేసులో ఆ మహిళా డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత వ్యక్తి మధురా బ్లాక్‌లోని వార్డు నెంబర్ 12 కౌన్సిలర్. ప్రస్తుతం అతన్ని పాట్నా మెడికల్ కాలేజీలో చికిత్స కోసం చేర్పించారు.
గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో ఆ లేడీ డాక్టర్ రిలేషన్లో ఉన్నది. ఈ విషయాన్ని ఆమె కూడా అంగీకరించింది. అయితే పెళ్లి చేసుకునేందుకు ఆ వ్యక్తి నిరాకరించడంతో.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు కూడా లేడీ డాక్టర్ సిద్దమైంది. పెళ్లి కోసం ఆమె కోర్టుకు వెళ్లింది. కానీ బాధిత వ్యక్తి మాత్రం రాలేకపోయాడు.
బాయ్‌ఫ్రెండ్ వ్యవహారంపై విరక్తి చెందిన ఆ డాక్టర్.. తన ఇంటికి అతన్ని పిలిచింది. ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్ పురుషాంగాన్ని కట్ చేసింది లేడీ డాక్టర్. అయితే కౌన్సిలర్ అరుపులు విన్న స్థానికులు .. జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలిపారు. బెడ్‌పై రక్తపు మడుగులో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నిందితురాలు అవివాహిత. ఆమె వయసు 25 ఏళ్లు. హజిపూర్ ఆమె స్వస్థలం. మధౌరాలో ఆమె ప్రాక్టీసు చేస్తోంది. బాధిత వ్యక్తి కూడా అవివాహితుడే అని మధౌరా పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. నిందితురాలని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

