Father, Son Lawyer Duo Shot Dead | బైక్పై కోర్టుకు వెళ్తున్న లాయర్లైన తండ్రీకొడుకులు.. దుండగుల కాల్పుల్లో మృతి
Father, Son Lawyer Duo Shot Dead | లాయర్లైన తండ్రీకొడుకులు కలిసి బైక్పై కోర్టుకు వెళ్తున్నారు. మార్గమధ్యలో కాపుకాసిన దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో తండ్రీకుమారులు మరణించారు. వీరి మృతిపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన నేరగాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పాట్నా: లాయర్లైన తండ్రీకొడుకులు కలిసి బైక్పై కోర్టుకు వెళ్తున్నారు. మార్గమధ్యలో కాపుకాసిన దుండగులు వారిపై కాల్పులు జరిపారు. (Father, Son Lawyer Duo Shot Dead) ఈ సంఘటనలో తండ్రీకుమారులు మరణించారు. వీరి మృతిపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీహార్లోని ఛప్రాలో ఈ సంఘటన జరిగింది. రామ్ అయోధ్య ప్రసాద్ రాయ్, ఆయన కుమారుడు సునీల్ కుమార్ రాయ్ న్యాయవాదులు. బుధవారం ఉదయం తండ్రీకొడుకులు కలిసి బైక్పై జిల్లా కోర్టుకు బయలుదేరారు.
కాగా, దుధియా బ్రిడ్జి వద్ద మాటువేసిన దుండగులు తండ్రీకొడుకులైన లాయర్లపై గన్తో కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కోర్టు న్యాయవాదులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ నిరసనకు దిగారు. తండ్రీకొడుకులైన లాయర్లపై గన్తో కాల్పలు జరిపి హత్య చేయడాన్ని ఖండించారు. నిందితులైన నేరస్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

