Crime news | మద్యం మత్తులో ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!
Crime news | ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగివచ్చి అతడు పెట్టే టార్చర్ భరించలేక 16 ఏళ్లుగా కాపురం చేసిన అతని భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు బిడ్డలను ఆమె అతని దగ్గరే వదిలేసి వెళ్లింది. ఏడాదిగా బిడ్డలను పోషించిన అతను.. భార్య తిరిగి రాకపోవడంతో మరింత ఒత్తిడి లోనయ్యాడు. ఈ క్రమంలో గత రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన అతను ముగ్గురు కూతుళ్ల గొంతు కోశాడు.
కొట్టాయం: ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగివచ్చి అతడు పెట్టే టార్చర్ భరించలేక 16 ఏళ్లుగా కాపురం చేసిన అతని భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు బిడ్డలను ఆమె అతని దగ్గరే వదిలేసి వెళ్లింది. ఏడాదిగా బిడ్డలను పోషించిన అతను.. భార్య తిరిగి రాకపోవడంతో మరింత ఒత్తిడి లోనయ్యాడు. ఈ క్రమంలో గత రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన అతను ముగ్గురు కూతుళ్ల గొంతు కోశాడు. అనంతరం తనకు తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు మద్యానికి బానిసగా మారి రోజూ వేధిస్తుండటంతో భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని, ఆమె తన ముగ్గురు కుమార్తెలను కూడా భర్త దగ్గరే వదిలేసి వెళ్లిందని పోలీసులు తెలిపారు.
భార్య దూరమవడంతో మానసిక ఒత్తిడికి లోనైన నిందితుడు చీటికిమాటికి ఆగ్రహంతో ఊగిపోయేవాడని, ఈ క్రమంలోనే గత రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను కూతుళ్లు గొంతులు కోశాడని తెలిపారు. ముందుగా చిన్న కూతురు గొంతు కోశాడని, అది చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు కూతుళ్లను వెంబడించి పట్టుకని గొంతులు కోశాడని చెప్పారు.
అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే, ఈ ఘటనలో బాధితులు ప్రాణాలు కోల్పేదని, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారి చిన్న కూతురు పరిస్థితి విషమంగా ఉన్నదని, మిగతా ఇద్దరు కూతుళ్లకు ప్రాణాపాయం లేదని చెప్పారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

