‘Cycle girl’ జ్యోతి తండ్రి గుండెపోటుతో మృతి
Cycle girl| గతేడాది లాక్డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చిన బీహార్‌కు చెందిన 'Cycle girl' జ్యోతి కుమారి తండ్రి గుండెపోటుతో మరణించారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.

లక్నో: గతేడాది లాక్డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చిన బీహార్‌కు చెందిన ‘Cycle girl’ జ్యోతి కుమారి తండ్రి గుండెపోటుతో మరణించారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో జ్యోతి కుమారి.. తన తండ్రి మోహన్ పాశ్వాన్‌ను హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్‌లోని దర్భాంగాకు సైకిల్‌పై తీసుకువచ్చింది. పాశ్వాన్‌ను సైకిల్‌పై వెనక కూర్చోబెట్టుకుని మొత్తం 1,100 కి.మీ. దూరం ప్రయాణించింది. దీంతో ఆమె మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది తర్వాత ఆయన నిన్న గుండె పోటుతో దర్భంగాలో చనిపోయారు.
మోహన్ పాశ్వాన్ గురుగ్రామ్‌లో ఈ-రిక్షా నడిపేవారు. దేశవ్యాప్త కరోనా లాక్డౌన్ వల్ల రిక్షా యజమాని దానిని తీసుకున్నాడు. దీంతో ఆయనకు ఉపాధిలేకుండా పోయింది. పాశ్వాన్ కాలికి గాయం కావడంతో ఆయన బాగోగులు చూడటానికి 16 ఏండ్ల జోత్యి గురుగ్రామ్‌కు వెళ్లింది. అదే సమయంలో లాక్డౌన్ రావడం.. చేసేందుకు పనుల్లేక జీవనం కష్టంగా మారింది. దీనికితోడు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో సైకిల్‌పై సొంతూరుకు చేరుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

