న్యూఢిల్లీ : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ (Fashion Designer) రోహిత్ బల్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది. గురుగ్రాంలోని మెదాంత ఆస్పత్రి ఐసీయూలో రోహిత్ బల్ వెంటిలేటర్‌పై ఉన్నారు. శ్రీనగర్‌లో జన్మించిన రోహిత్ 1986లో తన కెరీర్ ఆరంభించి దేశంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఎదిగారు.
మద్యానికి అలవాటుపడిన ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. 2010 ఫిబ్రవరిలో రోహిత్ గుండెపోటు రాగా యాంజియోప్లాస్టీ చేశారు. ఇక 2001లో రోహిత్ బల్ కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ అఛీవ్మెంట్ అవార్డ్, 2006లో ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 2012లో రోహిత్ బల్ లాక్మే గ్రాండ్ ఫినాలే డిజైనర్ టైటిల్ గెలుచుకున్నారు.
Read More :
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి