పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ కచ్చా బాదాం పాటతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. అతడు పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఈ పాటపై సెలబ్రిటీలతో సహా చాలామంది ఇన్‌స్టా రీల్స్ చేశారు. దీంతో భుబన్ బద్యాకర్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. తాజాగా, ఓ అభిమాని భుబన్ పాట విని ఆపిల్ ఐఫోన్ 13ని గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఢిల్లీలో భుబన్ బద్యాకర్ ఓ ప్రదర్శన ఇచ్చాడు. ఈ షో తర్వాత ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అతడి పాటకు ముగ్దుడై ఆపిల్ ఐఫోన్ 13ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ‘నా పాట విన్న తర్వాత ఢిల్లీకి చెందిన వ్యక్తి ప్రేమగా ఆపిల్ ఐఫోన్ 13 అందించాడు. నేను దీనిని ఎప్పుడూ ఊహించలేదు. నేను ఈ ఫోన్‌తో ఇప్పుడు ఫొటోలు క్లిక్ చేస్తున్నాను’ అని భుబన్ తెలిపాడు. ‘బాదం బెచే ఖై, సెలబ్రిటీ భాయ్, బదమేర్ తులోన దునియాతే నై అనే కొత్త పాటతో భుబన్ ఇప్పుడు అదరగొడుతున్నాడు. అతడు వైరల్ అయినప్పటి నుంచి ‘దాదాగిరి’, ‘ఇస్మార్ట్ జోడీ’ లాంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు.