Bengaluru | బెంగళూరులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రయివేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసిన ట్రాక్టర్లో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు.
Bengaluru | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రయివేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసిన ట్రాక్టర్లో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. వీటిలో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది ఈ పేలుడు పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చిక్కనాయకనహళ్లిలో పేలుడు పదార్థాలు భారీగా లభ్యం కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్ జరగడంతో 9 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు రివార్డును ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

