ఇలాగైతే బీజేపీ నేతలు రోడ్లపై తిరగలేరు : రాహుల్ పోస్టర్ల చించివేతపై సిద్ధరామయ్య ఫైర్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పోస్టర్లను చించివేయడంపై విపక్ష నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను శుక్రవారం హెచ్చరించారు.
బెంగళూర్ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పోస్టర్లను చించివేయడంపై విపక్ష నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను శుక్రవారం హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ పోస్టర్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారని, వారు ఇలాగే చేస్తే కాషాయ నేతలెవరూ కర్నాటకలో స్వేచ్ఛగా తిరగలేరని సిద్ధరామయ్య వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే బీజేపీ నేతలు బయటకు రాలేరని అన్నారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఇక భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్నాటకలోకి ప్రవేశించగా రాష్ట్ర సరిహద్దుల వద్ద రాహుల్ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు నేతలు పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ex cm
- karnataka
- Siddaramaiah
- warns
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

