విల్లాల్లో రేవ్ పార్టీ.. 22 మంది అరెస్టు

ముంబై : మహారాష్ట్రలో ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాసిక్‌లోని ఇగటపురి పట్టణంలో జరుగుతున్న రేవ్ పార్టీ నుంచి మాదకద్రవ్యాలు, హుక్కాలు సీజ్ చేశారు. అరెస్టు చేసినవారిలో 12 మంది మహిళలు ఉన్నారు. దాంట్లో రియాల్టీ టీవీ షో బిగ్‌బాస్ కాంటెస్టాంట్ కూడా ఉన్నది. కొందరు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీతో లింకున్న మహిళలు కూడా ఉన్నారు. గుర్తు తెలియనివారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రెండు విల్లాలపై రెయిడ్ నిర్వహించారు. స్కై తాజ్, స్కై లాగూన్ అనే విల్లాల్లో ఈ రేవ్ పార్టీలు జరిగాయి. అరెస్టు అయినవారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. పార్టీని ఆర్గనైజ్ చేసినవారి కోసం కూడా వెతుకుతున్నారు. పార్టీలో పాల్గొన్నవారిలో చాలా మంది హై ఎండ్ కారుల్లో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్టీతో లింకు ఉన్న ఓ నైజీరియా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై-ఆగ్రా హైవే మధ్య రహదారిలో ఆ విల్లాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drugs
- nashik
- rave party
- villas
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

