Election Schedule | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే..!
Election Shedule | దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ: దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేది. నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న తొలి విడత పోలింగ్, నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరుగనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మాదిరిగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్ తొలి దశ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది అక్టోబర్ 20, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23. అక్టోబర్ 21 నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. నవంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఛత్తీస్‌గఢ్ రెండో దశ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 2 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 30న గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నుంచి నవంబర్ 9 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. నవంబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

