Election Commission | ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీల కోసమే..!
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇకపై ఇందులోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది.
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇకపై ఇందులోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వివరాలతో పాటు పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలను ఈ పోర్టల్ ద్వారా అందించవచ్చని చెప్పింది. దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఈ పోర్టల్‌ను 3సీ వ్యూహంలో భాగంగా పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు చెప్పింది. అక్రమ నిధులను అరికట్టడం, రాజకీయ పార్టీల నిధులు, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యం పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు చెప్పింది.
తమ ఆర్థిక నివేదికను ఆన్లైన్లో ఇవ్వకూడదని భావిస్తే.. అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని, ఆన్లైన్లో సమర్పించకపోతే నిర్దేశించిన ఫార్మాట్లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ కాపీ ఫార్మాట్లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. ఆన్లైన్లో ఆర్థిక నివేదికలను దాఖలు చేయనందుకు పార్టీ పంపిన సమర్థన లేఖతో పాటు అలాంటి అన్ని నివేదికలను ఆన్లైన్లో ప్రచురిస్తుందని ఈసీ పేర్కొంది. ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951 మరియు కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఆర్థిక నివేదికలను రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

