‘సర్’ ట్రిబ్యునల్ జడ్జీలకు ఈసీ ఝలక్!
ఆధార్ ధృవీకరణ ఫీచర్‌పై పశ్చిమ బెంగాల్ ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) అప్పిలేట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులు ఎన్నికల సంఘం పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి నిరాకరించి నెలరోజులు దాటింది.
- మీ గుర్తింపు నిరూపించుకోండంటూ కొత్త నిబంధనలు
- సెప్టెంబర్ 21 నుంచి ఆగిపోయిన ఓటర్ల అప్పీళ్లు
కోల్‌కతా: ఆధార్ ధృవీకరణ ఫీచర్‌పై పశ్చిమ బెంగాల్ ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) అప్పిలేట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులు ఎన్నికల సంఘం పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి నిరాకరించి నెలరోజులు దాటింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు వారి పాన్‌కార్డ్, ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించి డిజిటల్ సంతకాల సర్టిఫికెట్లను సృష్టించుకోవాలని ఎన్నికల సంఘం గత వారం కోరినట్టు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమితులైన న్యాయమూర్తులు ఆధార్ ధ్రువీకరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ సెప్టెంబర్ 24న పశ్చిమ బెంగాల్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి(ఏసీఈవో)కి లేఖ రాశారు. ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్(ఐటీ) సీమా ఖన్నా పోర్టల్ అప్డేట్ల గురించి న్యాయమూర్తులకు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 21న ఈ ఫీచర్‌ను తిరిగి చేర్చారు. గత వారం ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా డిజిటల్ సంతకాల సర్టిఫికెట్లను ఏర్పాటు చేసుకోవాలని న్యాయమూర్తులను కోరింది.
అప్పీళ్ల పరిష్కారం కోసం ఏటీ పోర్టల్ నుంచి ఆధార్ ధ్రువీకరణ స్క్రీన్‌ను తొలగించాలని అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోని న్యాయమూర్తులు కోరుతున్నారని పేర్కొంటూ సెప్టెంబర్ 24న ఏసీఈవోకి ట్రిబ్యునల్స్ వేదిక-ఇన్చార్జ్ లేఖ రాశారు. అప్పటి నుంచి న్యాయమూర్తులు పోర్టల్‌లోకి లాగిన అవ్వడం లేదా అప్పీళ్లను పరిష్కరించడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

