న్యూఢిల్లీ : వివాహ వ్యవస్ధను ప్రశ్నించే రోజుల్లో దశాబ్ధాల తరబడి ఒకరికొకరు తోడుగా వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్న వృద్ధ దంపతుల వీడియో (Viral Video) మళ్లీ ప్రజల్లో ప్రేమ పట్ల, వివాహ బంధం పట్ల నమ్మకాన్ని పెంపొందిస్తోంది. ఫొటోగ్రాఫర్ సుతేజ్ సింగ్ పన్ను ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. పార్క్‌లో కూర్చున్న వృద్ధ సిక్కు దంపతుల వద్దకు వెళ్లిన సుతేజ్ పన్ను వారిని ఫొటోషూట్‌కు ఒప్పించాడు.
అందుకు సమ్మతించిన వృద్ధ జంట కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ జంట తమ పాత ఫొటోను గుర్తుచేసేలా దాన్ని రీక్రియేట్ చేయడంతో ఫొటోషూట్ ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఫొటోషూట్‌లో భాగంగా సుతేజ్ వారితో ముచ్చటిస్తూ వారి వివాహం ఎలా జరిగిందీ అనే వివరాలతో పాటు వారి మధ్య అనుబంధం గురించి పలు వివరాలు రాబట్టారు.
వృద్ధ దంపతుల అన్యోన్యత నెటిజన్లను విశేషంగా ఆకట్టుఉకంది. కామెంట్స్ సెక్షన్ హార్ట్, లవ్ ఎమోజీలతో నిండిపోయింది. బీబీని బాపు పూర్తిగా ఇష్టపడ్డాడు..వారు జీవితాన్ని సంతోషంగా, అద్భుతంగా ఆస్వాదించారని ఓ యూజర్ కామెంట్ చేశారు. సుతెజ్ మీ వీడియోలు మాకు ఓ థెరఫీలా పనిచేస్తాయని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Heavy Rain | ముంబైకి రెడ్ అలర్ట్ .. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న బీఎంసీ