Eknath Shinde | ప్రమాణ స్వీకారం సందర్భంగా షిండే సొంత ప్రసంగం.. షాకైన నేతలు
Eknath Shinde | మహాయుతి కూటమిని చివరివరకు టెన్షన్‌కు గురి చేసిన ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా దానిని కొనసాగించారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను ప్రారంభించారు. అయితే షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవడానికి బదులు సొంతంగా ప్రసంగించారు.
ముంబై: మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మహాయుతి కూటమిని చివరివరకు టెన్షన్‌కు గురి చేసిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా దానిని కొనసాగించారు.
కాగా, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను ప్రారంభించారు. అయితే షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవడానికి బదులు సొంతంగా ప్రసంగించారు. ‘నా గురువు ధర్మవీర్ ఆనంద్ దిఘేని స్మరించుకుంటూ హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకు నా ప్రణామాలు. ప్రధాని మోదీ బలమైన నాయకత్వం, హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో, మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ఓటర్ల మద్దతుతో..’ అని మాట్లాడసాగారు. దీంతో వేదికపై ఉన్న మోదీ, అమిత్ షాతో సహా ముఖ్యనేతలు షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోయమం చెందారు.
మరోవైపు ఏక్నాథ్ షిండే ప్రసంగాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అడ్డుకున్నారు. ప్రమాణ స్వీకార ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తూ తిరిగి ‘నేను’ అని అన్నారు. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే షిండే ప్రమాణ స్వీకారం చెల్లినప్పటికీ సంబంధిత ప్రోటోకాల్‌ను ఆయన పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
#WATCH | Shiv Sena’s Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw
— ANI (@ANI) December 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

