కేజ్రీవాల్‌కు మరో 4 రోజుల కస్టడీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు ఆయన్ని కోర్టు ముందు హాజరుపరుచాలని ఈడీని ఆదేశించింది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ గురువారం ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు.
- ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు
- అంతకుముందు స్వీయ వాదనలు వినిపించిన కేజ్రీ
- ఆప్‌ను నాశనం చేయడానికి యత్నిస్తున్నారని ఫైర్
- స్కామ్ జరిగితే వంద కోట్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్న
- మద్యం పాలసీ కేసు రాజకీయ కుట్ర అన్న ఢిల్లీ సీఎం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు ఆయన్ని కోర్టు ముందు హాజరుపరుచాలని ఈడీని ఆదేశించింది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ గురువారం ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. దర్యాప్తు సమయంలో కేజ్రీవాల్ తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెప్పారని, డిజిటల్ డివైజ్‌ల పాస్‌వర్డ్‌లను కూడా చెప్పలేదని ఈడీ ఆరోపించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో కలిపి ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. మరో ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. అయితే, కోర్టు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కాగా అంతకు ముందు కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు.
ఆ వాంగ్మూలం సరిపోతుందా?
కోర్టులో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజల ముందు ఆప్‌ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించి, నాశనం చేయడానికి ఈడీ తొలి నుంచీ ప్రయత్నిస్తున్నది. నన్ను అరెస్టు చేసినప్పటి నుంచీ వాళ్లు (ఈడీ) చెబుతున్న రూ. 100 కోట్లను ఇంతవరకూ పట్టుకోలేదు. మద్యం కేసులో నన్ను అరెస్టు మాత్రమే చేశారు. అయితే నేను తప్పు చేశానని ఏ కోర్టులోనూ రుజువుకాలేదు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ 31 వేల పేజీల ఛార్జ్‌షీట్, ఈడీ మరో 25 వేల పేజీల ఛార్జ్షీట్లను సమర్పించాయి. అయితే, వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాత కూడా నన్ను ఎందుకు అరెస్టు చేశారన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకట్లేదు. ఇన్ని వేల పేజీల ఛార్జ్షీట్లలో నా పేరును నాలుగుసార్లు మాత్రమే ప్రస్తావించారు. అక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ అని కాకుండా సీ అరవింద్ అని రాసి ఉంది. నిజానికి సీ అరవింద్ అనే వ్యక్తి మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కార్యదర్శి. ఈడీ విచారణలో కూడా.. నాకు సిసోడియా కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చాడని సదరు అరవింద్ చెప్పాడు. నాకు రోజూ ఎందరో ఎమ్మెల్యేలు ఎన్నో డాక్యుమెంట్లు ఇస్తారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇదో భాగం. నా పేరును నలుగురు సాక్షులు ప్రస్తావించినట్టు ఈడీ చెప్తున్నది. ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఈ నాలుగు వాంగ్మూలాలు సరిపోతాయా? ఈడీ చెప్తున్నట్టు ఒకవేళ నిజంగా కుంభకోణం జరిగితే, ఆ రూ. 100 కోట్ల డబ్బు ఏది? ఎక్కడ? ఏదేమైనా ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు నేను సిద్ధమే’ అని చెప్పారు.
ఇది ‘రాజకీయ కుట్ర’
కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను రౌస్అవెన్యూ కోర్టులో హాజరుపరుచడానికి గురువారం ఈడీ అధికారులు కోర్టు ప్రాంగణంలోకి తీసుకెళ్తున్న సమయంలో అక్కడున్న మీడియాతో ఆయన మాట్లాడారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు ‘రాజకీయ కుట్ర’ అని.. దీనికి ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
గోవా ఆప్ నేతలను ప్రశ్నించిన ఈడీ
పనాజీ: ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మద్యం పాలసీ కేసులో అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పుడు గోవాపై దృష్టి సారించింది. మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ గోవా యూనిట్ అధ్యక్షుడు అమిత్ పాలేకర్, మరో ముగ్గురిని ఈడీ గురువారం ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తమను ఈడీ అధికారులు ప్రశ్నించారని, అడిగిన పత్రాలన్నీ అందజేశామని వారు చెప్పారు. అధికార పార్టీ వేధింపులకు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని పాలేకర్ ఆరోపించారు. విచారణకు మళ్లీ రమ్మనమని ఈడీ చెప్పలేదని, అయితే మరోసారి తనకు సమన్లు రావడం ఖాయమని ఆయన అన్నారు. కాగా, వారిని ఈడీ విచారించినంత సేపు ఎమ్మెల్యేలు వెంజీ వీగస్, క్రూజ్ సిల్వాలో కార్యాలయం బయట వేచి ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

