‘సర్’లో ఓటు కోల్పోతే ఫామ్-6తో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో పేర్లు తొలగించబడినవారు మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫామ్-6 సమర్పించవచ్చని ఎన్నికల సంఘం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. సర్ ప్రక్రియలో ఓటు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈసీ ఈ విషయం వెల్లడించింది. తాము చిరునామా మారడంతో గణన ప్రక్రియలో పాల్గొనలేకపోయామని, అందువల్ల ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిపోయాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
- ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో పేర్లు తొలగించబడినవారు మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫామ్-6 సమర్పించవచ్చని ఎన్నికల సంఘం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. సర్ ప్రక్రియలో ఓటు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈసీ ఈ విషయం వెల్లడించింది. తాము చిరునామా మారడంతో గణన ప్రక్రియలో పాల్గొనలేకపోయామని, అందువల్ల ఓటర్ల జాబితాలో పేర్లు తొలగిపోయాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ఫామ్-6 సమర్పించాలనే నిబంధనకు బదులుగా, పాత పేర్లను పునరుద్ధరించేందుకు ఫామ్-8 ద్వారా అవకాశం కల్పించాలని కోరారు. అయితే, 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం ఫామ్-6ని సమర్పించి, సమస్యను పరిష్కరించుకోవచ్చని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎన్నికల నమోదు అధికారి కూడా అవసరమైన సహాయం అందిస్తారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

