Dutch YouTuber | డచ్ యూట్యూబర్‌పై వ్యాపారి దాడి
డచ్ యూట్యూబర్‌పై బెంగళూర్‌లోని చిక్పేట్ వద్ద ఓ స్ధానిక వ్యాపారి దురుసుగా వ్యవహరించాడు. ఆ ప్రాంతంలో యూట్యూబర్ (Dutch YouTuber ) వీడియో రికార్డు చేస్తుండగా అతడిని అడ్డగించిన వ్యాపారి దౌర్జన్యం చేశాడు.
బెంగళూర్ : డచ్ యూట్యూబర్‌పై బెంగళూర్‌లోని చిక్పేట్ వద్ద ఓ స్ధానిక వ్యాపారి దురుసుగా వ్యవహరించాడు. ఆ ప్రాంతంలో యూట్యూబర్ (Dutch YouTuber ) వీడియో రికార్డు చేస్తుండగా అతడిని అడ్డగించిన వ్యాపారి దౌర్జన్యం చేశాడు. హోల్‌సేల్, రిటైల్ దుస్తుల వ్యాపారానికి పేరొందిన చిక్‌పేట్‌లో యూట్యూబర్ వీడియో రికార్డు చేస్తుండగా స్దానిక వ్యాపారి అభ్యంతరం తెలిపారు.
యూట్యూబర్ పెడ్రో మోటాను వ్యాపారి అడ్డగించి దురుసుగా వ్యవహరించాడు. యూట్యూబర్ నమస్తే పెడుతున్నా వినిపించుకోని వ్యాపారి నమస్తే ఎందుకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అతడి చేయి పట్టుకుని గట్టిగా మెలితిప్పాడు. ఎట్టకేలకు వ్యాపారి పట్టు నుంచి విడిపించుకున్న యూట్యూబర్ ఎలాగోలా అక్కడినుంచి బయటపడ్డాడు.
పెడ్రో ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. చిక్పేట్ క్లాత్ మార్కెట్ విశేషాలను తాను రికార్డు చేస్తుండగా స్ధానిక వ్యాపారి కోపోద్రిక్తుడై తన పట్ల దురుసుగా వ్యవహరించాడని ఆ పోస్ట్‌లో పెడ్రో రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More
Encounter | చత్తీస్‌ఘడ్‌లో ఎన్కౌంటర్ : అటవీ ప్రాంతంలో కాల్పుల హోరు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

