SpiceJet Flight | విరిగిన విమానం ఇంజిన్ బ్లేడ్లు.. స్పైస్‌జెట్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
SpiceJet Flight | స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహించారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు.
కోల్‌కతా: విమానం టేకాఫ్ సమయంలో ఇంజిన్ బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కోల్‌కతా ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహించారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. 1.27 గంటలకు తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన178 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు స్పైస్‌జెట్ తెలిపింది. దీంతో బ్యాంకాక్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 7 గంటలకు ఆ విమానం కోల్‌కతా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినట్లు చెప్పింది. అయితే తెల్లవారుజామున 2 గంటల వరకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ పరిస్థితి కొనసాగినట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. ఇంజిన్ బ్లేడ్లు విరిగిన విమానాన్ని బే నుంచి వాహనంతో లాక్కెళ్లినట్లు వివరించింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ బ్లేడ్లు విరిగినట్లు దర్యాప్తులో గ్రహించామని పేర్కొంది. ఈ విషయాన్ని డీజీసీఏకు నివేదించినట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

