Traffic Jam: కిలోమీటరుకు గంట జర్నీ టైమ్.. ఢిల్లీలో రోడ్లన్నీ జామ్
Traffic Jam: ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ దూరం చేరేందుకు గంట సమయం పడుతోంది. రైతు ఆందోళన నేపథ్యంలో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
న్యూఢిల్లీ: ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం.. దేశ రాజధానిని స్తంభింపచేసింది. రోడ్లన్నీ వాహనాలతో(Traffic Jam) నిండిపోయాయి. పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ పలు రైతు సంఘాలు ఇవాళ ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీని కలిపే కీలక పాయింట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామైంది. ఛలో ఢిల్లీ నేపథ్యంలో పలు కూడళ్లలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
ఘాజిపూర్, చిల్లా బోర్డర్ల వద్ద కార్లు బారులు తీరాయి. ఘజియాబాద్, నోయిడా మార్గం కిక్కిరిసిపోయింది. డీఎన్డీ ఫ్లైఓవర్‌పై చిక్కుకున్న ఓ ప్రయాణికుడు గంట సమయంలో కేవలం ఒక్క కిలోమీటర్ దూరం మాత్రమే ప్రయాణించినట్లు చెప్పాడు. గంటలు గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఎన్‌హెచ్-48 వద్ద ట్రాఫిక్ స్లోగా ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్ రూట్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వెహికల్ చెకింగ్ పాయింట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్ ప్రదేశాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకునేందుకు భారీ బ్యారీకేడ్లను పెట్టారు. కాంక్రీట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. ఇనుపు వైర్లు, మేకులను కూడా అమర్చారు.
రైతు సంఘాలు గత రాత్రి ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. కానీ ఆ చర్చలు ఫలించలేదు. కనీస మద్దతు ధర చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో ఢిల్లీలోకి వస్తున్న గూడ్స్ వాహనాలను బ్యాన్ చేశారు. హర్యానాలోని సిర్సా, యూపీలోని సూరజ్పుర్కు వెళ్లూ సరుకు వాహనాలను కూడా అనుమతించడం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

