న్యూఢిల్లీ, మే 28: గేమింగ్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న లక్ష్యంతో దుబాయ్ గేమింగ్ వీసాను ఆవిష్కరించింది. దీర్ఘకాలం చెల్లుబాటయ్యే ఈ వీసా ద్వారా గేమర్స్, కంటెంట్ క్రియేటర్స్, పరిశ్రమ నిపుణులను ఆకర్షించాలని నిర్ణయించింది.
ఈ వీసా పొందినవారికి దీర్ఘ కాలం దుబాయ్‌లో నివసిస్తూ గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పిస్తారు. పన్ను రాయితీలూ కల్పిస్తారు. 25 ఏండ్లు పైబడిన గేమింగ్ నిపుణులు ఎవరైనా గేమింగ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.