DSP Vehicle Dragged by Tanker | ట్యాంకర్ వెనుక ఇరుక్కున్న డీఎస్పీ వాహనం.. రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం
DSP Vehicle Dragged by Tanker | డీఎస్పీ వాహనం ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ ట్యాంకర్ ఆగకపోవడంతో ఇరుక్కున్న డీఎస్పీ వాహనాన్ని సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. చివరకు పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ ట్యాంకర్‌ను ఆపారు.
లక్నో: డీఎస్పీ వాహనం ఆయిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ ట్యాంకర్ ఆగకపోవడంతో ఇరుక్కున్న డీఎస్పీ వాహనాన్ని సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. (DSP Vehicle Dragged by Tanker ) చివరకు పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ ట్యాంకర్‌ను ఆపారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డీఎస్పీ తమ్కుహిరాజ్ జితేంద్ర సింగ్ కల్రా, డ్రైవర్ గులామ్ అఫ్సర్, గన్‌మ్యాన్ దివ్యమాన్ యాదవ్‌తో కలిసి ఆదివారం మహీంద్రా బొలెరోలో లక్నో వెళ్తున్నారు. బస్తీ సమీపంలోని జాతీయ రహదారి 28పై ఆ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను డీఎస్పీ వాహనం ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ వెనుక భాగంలో బొలెరో ఇరుక్కుపోయింది.
కాగా, ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ఆపలేదు. ఇరుక్కున్న డీఎస్పీ వాహనాన్ని రెండు కిలోమీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. చివరకు పోలీసులు హైవేపై బారికేడ్లు ఏర్పాటు చేసి ట్యాంకర్‌ను నిలిపివేశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు బొలేరో మధ్యలో కూర్చొన్న డీఎస్పీ జితేంద్ర సింగ్ కల్రా ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. అయితే ముందు ఉన్న డ్రైవర్, గన్‌మ్యాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
DSP की हत्या की साजिश…
UP : जिला बस्ती में एक वाहन ने DSP जितेंद्र कालरा की सरकारी बुलेरो में पीछे से टक्कर मार दी। बुलेरो आगे चल रहे टैंकर में घुस गई। टैंकर 2 KM दूर तक बुलेरो घसीटता ले गया। DSP के ड्राइवर-गनर घायल हैं। बुलेरो चकनाचूर हुई। pic.twitter.com/oEvBbggoTa
— TRUE STORY (@TrueStoryUP) February 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

