లక్నో: మద్యం మత్తులో ఉన్న పోలీస్ అధికారి కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. నిలదీసిన వాహనదారులపై రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో వాహనదారులు, స్థానికులు అతడ్ని చితక బాదారు. (Drunk Police Officer Thrashed) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్ అధికారి అమిత్ కుమార్ తెవాటియా, మీరట్ పోలీస్ కమిషనర్ సెల్వ కుమారికి గన్నర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం సివిల్ డ్రెస్‌లో ఉన్న అతడు మద్యం సేవించాడు. ఆ మత్తులో వాహనాం నడిపాడు. లాల్కుర్తి ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న ఒక మహిళను తొలుత ఢీకొట్టాడు. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో ఒక కారుతోపాటు పలు వాహనాలను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి.
కాగా, ఆగ్రహించిన వాహనదారులు, స్థానికులు అమిత్ కుమార్‌ను కారు నుంచి బయటకు లాగారు. ఆపై అతడ్ని చితక్కొట్టారు. అయితే తాను పోలీస్ అంటూ హంగామా చేశాడు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో పలు వాహనాలను ఢీకొట్టి చెత్త డబ్బా వద్ద పడి ఉన్న అమిత్ కుమార్‌ను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
मेरठ में खुद को कमिश्नर का गनर बताने वाले युवक ने कई गाड़ियों को रौंदा,युवक ने SSP आवास के आगे गाड़ियों को मारी टक्कर,एक नहीं कई गाड़ियों को मारी टक्कर, शराबी अपने आप बता रहा कमिश्नर का गनर,मौके पर पहुंची लाल कुर्ती पुलिस ने गाड़ियों को हटाया। @meerutpolice #Meerut pic.twitter.com/pGAmnEgNFK
— Shanu Kumar (@imShanu18) December 30, 2023
#मेरठ #कमिश्नर के शराबी #गनर ने कई गाड़ियों को रौंदा
SSP आवास के आगे स्कूटी पर चढ़ाई गाड़ी, कई लोग हुए घायल
आरोपी पुलिसकर्मी को बचाने में जुटी थाना पुलिस
थाना लालकुर्ती क्षेत्र के SSP आवास के पास का मामला@meerutpolice @DmMeerut @CommissionerMe3 @Uppolice pic.twitter.com/JvmmlyimqZ
— PRIYA RANA (@priyarana3101) December 30, 2023
मेरठ कमिश्नर के गनर ने कई गाड़ियों को रौंदा
शराबी पुलिसकर्मी ने स्कूटी पर चढ़ाई गाड़ी
SSP आवास के आगे स्कूटी पर गाड़ी चढ़ाई
आधे दर्जन गाड़ियों पर चढ़ा दी गाड़ी
पुलिसकर्मी ने खुद को कमिश्नर का बताया गनर
मौके पर पहुंची लाल कुर्ती पुलिस
पुलिस ने सड़कों से गाड़ियों को हटाया… pic.twitter.com/eJPAYBo7rW
— News1Indiatweet (@News1IndiaTweet) December 30, 2023