Droupadi Murmu | నేడు మహాకుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొననున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొననున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. గంగా, యమునా, సర్వసతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం, ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శిస్తారు. అదేవిధంగా కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటుచేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్‌ను పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు ప్రయాగ్‌రాజ్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరుతారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
జనవరి 13న పుష్య పౌర్ణమి సందర్భంగా మహాకుంభ్ మేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకూ 42 కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. కాగా, ఈ నెల 5న ప్రధాని మోదీ కూడా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 90 నిమిషాల పాటు ఆయన మహాకుంభమేళాలో గడిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

