స్వతంత్ర అభ్యర్థిగా సీఎం చన్నీ సోదరుడు…. నామినేషన్ దాఖలు చేసిన మనోహర్ సింగ్

చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం చన్నీ సోదరుడైన మనోహర్ సింగ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ‘తగ్గేదేలే’ అంటున్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు. మనోహర్ సింగ్, బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్కు ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాలో ప్రకటించింది.
కాగా, కాంగ్రెస్ టికెట్ నిరాకరణపై సీఎం చన్నీ సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ చన్నీ గత ఆదివారం స్పందించారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం నియోజకవర్గం ప్రజలకు చాలా అన్యాయమని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయమని చాలా మంది తనను కోరుతున్నారని అన్నారు. ప్రజల అభిష్టం మేరకు తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తన అన్నతో మాట్లాడి ఒప్పిస్తానని తెలిపారు. 2007లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

