Dolo-650 | డోలో-650 ప్రమోషన్.. వైద్యులకు రూ.1000 కోట్ల ఉచిత గిఫ్ట్‌లు!
Dolo-650 | డోలో-650 ప్రమోషన్ కోసం వైద్యులకు రూ.1000 కోట్ల ఉచిత బహుమతులు ఇచ్చారని ఎఫ్ఎంఎస్ఆర్ఏ ఆరోపించింది.
Dolo-650 | ప్రముఖ పెరసిటమాల్ టాబ్లెట్ `డోలో-650` తయారీ దారులు.. దాని ప్రమోషన్ కోసం వైద్యులకు రూ.1000 కోట్ల విలువైన ఉచిత బహుమతులు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై డోలో-650 తయారీదారులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చేసిన ఆరోపణలను ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటెటివ్స్ అసోసియేషన్ (ఎఫ్ఎంఎస్ఆర్ఏ) సీనియర్ న్యాయవాది సంజయ్ పరీఖ్ ధృవీకరించారు. ఏదేనీ 500 ఎంజీ టాబ్లెట్‌కు ధరను ప్రభుత్వ నియమిత కమిటీ ఖరారు చేస్తుందని సుప్రీంకోర్టుకు చెప్పారు.
కానీ 500 ఎంజీ కంటే ఎక్కువ మోతాదు కల డోలో-650 యజమానులే దాని ధరను ఖరారు చేశారని సంజయ్ పరీఖ్ పేర్కొన్నారు. అధిక లాభాలు గడించేందుకు వీలుగా రోగులకు డోలో-650 ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు ఉచిత బహుమతులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇటువంటి అంశం తీవ్రమైందని వ్యాఖ్యానించింది.
కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నట్రాజ్ను పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయడానికి వైద్యులకు ఉచిత ఇన్సెంటివ్‌లు ఇచ్చే ఫార్మాస్యూటికల్ సంస్థలను శిక్షించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం న్యాయస్థానం విచారించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చేనెల 29కి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

