మహిళ కడుపులో నుంచి 47 కిలోల కణతి తొలగింపు.. ఎక్కడో తెలుసా?
56 ఏళ్ల మహిళ గత 18 ఏళ్ల నుంచి కడుపులో గడ్డతో బాధపడుతోంది. గత కొన్ని నెలల నుంచి మంచానికే పరిమితం అయింది
ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ మహిళ కడుపులో నుంచి ఏకంగా 47 కిలోల కణతిని డాక్టర్లు తొలగించారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఇంత పెద్ద కణతిని తొలగించింది లేదు. 56 ఏళ్ల మహిళ గత 18 ఏళ్ల నుంచి కడుపులో గడ్డతో బాధపడుతోంది. గత కొన్ని నెలల నుంచి మంచానికే పరిమితం అయింది. దానికి కారణం.. అది పెద్ద సైజ్‌లో పెరగడమే.
ఆ కణతి ఏకంగా 47 కిలోలు పెరగడంతో తను లేవలేకపోయింది. ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. సోనోగ్రఫీలో తన కడుపులో పెద్ద కణతి ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు.. రెండేళ్ల కిందనే ఆపరేషన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ.. తన సర్జరీ సక్సెస్ కాలేదు. కణతి.. తన శరీరంలోని అవయవాలకు అంటుకొని ఉండటంతో దాన్ని బయటికి తీయలేకపోయారు. సర్జరీని ఆపేశారు.
దీంతో దాని బరువు మరింత పెరిగింది. చివరకు ఇటీవల మళ్లీ ఆపరేషన్ చేసి 47 కిలోల బరువు ఉన్న కణతిని తన శరీరంలో నుంచి తొలగించారు. దీంతో ఆ మహిళ బరువు ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. గతంలో 52 ఏళ్ల మహిళ కడుపులో నుంచి ఢిల్లీలో 50 కిలోల కణతిని తొలగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

