Bengaluru | బెంగళూరులో అరుదైన ఘటన..! 8ఏళ్ల బాలిక కడుపులో క్రికెట్ బాల్ సైజున్న హెయిర్‌బాల్ తొలగింపు..!
Bengaluru | కర్ణాటక బెంగళూరులో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. ఎనిమిది సంవత్సరాల బాలిక కడుపులో క్రికెట్ బాల్ సైజులో ఉన్న హెయిర్ బాల్‌ను ఆపరేషన్ చేసి తొలగించారు. బాధిత బాలిక ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
Bengaluru | కర్ణాటక బెంగళూరులో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. ఎనిమిది సంవత్సరాల బాలిక కడుపులో క్రికెట్ బాల్ సైజులో ఉన్న హెయిర్ బాల్‌ను ఆపరేషన్ చేసి తొలగించారు. బాధిత బాలిక ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్న వారికి జుట్టు తినే అలవాటు ఉంటుందని.. దాన్ని రాంపుజెల్ సిండ్రోమ్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. బాధితురాలికి గత రెండేళ్లుగా ఆకలి లేకపోవడం, తరుచు వాంతులు చేసుకుంటూ వస్తుంది. దాంతో తల్లిదండ్రులకు ఆందోళనకు గురై.. ఆమెను పిడియాట్రిషన్, ఈఎన్టీ తదితర స్పెషలిస్ట్ వైద్యులకు చూపించింది. అయినా, ఎలాంటి ఫలితం కనిపించలేదు. పలు ఆసుపత్రుల్లో చూపించినా బాలిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే, ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్య ఉండొచ్చని భావించారు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న ఆస్టర్స్ పిల్లల, మహిళల ఆసుపత్రికి వెళ్లారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు బాలిక ట్రైకోబెజోర్ ఉన్నట్లు గుర్తించారు.
బాలిక జీర్ణాశయాంతర పేగుల్లో భారీగా జుట్టుకు పేరుకుపోయింది. ఆ తర్వాత ఓపెన్ స్టమక్ ఆపరేషన్ చేసి క్రికెట్ బాల్ సైజులో ఉన్న హెయిర్ బాల్‌ను తొలగించారు. ట్రైకోబెజోర్ అనేది చాలా అరుదైన పరిస్థితి అని.. సదరు బాలిక తరహాలోనే చిన్నపిల్లల్లో కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. ట్రైకోఫాగియాతో సంబంధం ఉంటుందని.. ఇది జట్టును తినే మానసిక రుగ్మత అని పేర్కొన్నారు. సాధారణంగా కౌమారదశలో ఉన్న బాలికల్లో కనిపిస్తుందని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మంజరి సోమశేఖర్ తెలిపారు. హెయిర్ బాల్ పెద్దగా, జిగటగా ఉన్నందున ఎండోస్కోపిక్ చేసేందుకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నందున లాపరోటమీగా పిలిచే ఓపెన్ స్టమక్ సర్జరీని బాలికకు చేసినట్లు తెలిపారు. మొత్తం రెండున్నర గంటల్లో సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. బాలికకు సర్జరీ చేయకపోతే తీవ్రమైన పోషకాహార లోపం, రక్తహీనత, కడుపు నుంచి గణనీయమైన రక్తస్రావానికి దారి తీసే అవకాశం ఉండేదన్నారు. ఆపరేషన్ అనంతరం ప్రత్యేకంగా ఆహారంతో పాటు కౌన్సెలింగ్ సైతం ఇస్తున్నట్లు వైద్యులు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
Bharat Summit | కార్మికుల నెత్తురుతో.. సమ్మిట్ సోకులు.. భారత్ సమ్మిట్‌కు ఖర్చు చేసే సొమ్ములో మేజర్ వాటా కార్మిక సంక్షేమ బోర్డుదే!
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి బల ప్రయోగం.. 20 మంది ప్రాణాలు కాపాడిన బాండీ బీచ్ హీరోకు సొంత రాష్ట్రంలో కష్టాలు
Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

