Doctor Dragged: కారు బానెట్‌పై డాక్టర్‌ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. వీడియో
Doctor Dragged: కారు బానెట్‌పై ఓ డాక్టర్‌ను 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు దుండగులు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో జరిగింది. దానికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు.
పంచకుల: హర్యానాలోని పంచకుల సిటీలో దారుణ ఘటన జరిగింది. కారు బానెట్‌పై ఓ డాక్టర్(Doctor)ను 50 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లారు(Dragged). ఈ ఘటన శనివారం జరిగింది. దానికి చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాళ్లోకి వెళ్తే.. పంచుకులలోని ఎండీసీలో డాక్టర్ గగన్ నివసిస్తున్నారు. అయితే ట్యూషన్ నుంచి తన కొడుకును ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సెక్టార్ 8లోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద డాక్టర్ గగన్ వాహనాన్ని మరో కారు ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ కారును ఆపాలని డాక్టర్ గగన్ డిసైడ్ అయ్యారు. ప్రత్యర్థి కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి వెళ్లాడు. కారు ముందు నిలబడ్డ డాక్టర్‌పై వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో డాక్టర్ బానెట్ పట్టుకున్నాడు. కారులో ఉన్న వ్యక్తులు ఆ డాక్టర్‌ను అలాగే తీసుకెళ్లారు. దాదాపు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు చెందిన కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. సెక్టార్ 6 హాస్పిటల్లో ఆ డాక్టర్‌కు చికిత్స చేశారు.
#Video: Doctor Dragged For 50 Meters On Car Bonnet In Panchkula
Road Rage Incident in Panchkula#PANCHKULA #ROADRAGE #DOCTORDRAGGED #LatestUpdates pic.twitter.com/JQgpinikw6
— mishikasingh (@mishika_singh) August 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

