కరోనా ఎఫెక్ట్: అవసరమైతేనే నిందితులను అరెస్ట్ చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా వేళ సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే నేరాల విషయంలో నిందితులను అవసరమైతేనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఖైదీలందరికీ సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఖైదీలను గుర్తించి, వెంటనే రిలీజ్ చేసేలా చూడాలని రాష్ట్రాలు, యూటీలు ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీలకు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జైళ్లలో రద్దీని తగ్గించే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఇప్పటికే పెరోల్‌పై ఉన్న వాళ్లకు మరో 90 రోజులు పొడిగించాలనీ ఆదేశించింది. గతేడాది మార్చి 23న కరోనా నేపథ్యంలోనే తాత్కాలిక బెయిలు ఖైదీలు, పెరోల్‌పై ఉన్న వాళ్లను, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను రిలీజ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, యూటీలను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
జైళ్లలో కరోనా వ్యాప్తిని అదుపులో ఉంచడానికి తరచూ ఖైదీలు, జైలు అధికారులకు టెస్టులు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఖైదీలకు వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో 4 లక్షలకుపైగా ఖైదీలు ఉన్నారు. కొన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఉన్నట్లు కూడా కోర్టు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

