స్టాలిన్ గెలుపు : మేయర్ టూ ముఖ్యమంత్రి
కరుణానిధి ( Karunanidhi ) కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్ చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం

కరుణానిధి ( Karunanidhi ) కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్ చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి, జయలలిత ( jayalalitha )మరణించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో డీఎంకేను విజయం వైపు నడిపించిన స్టాలిన్ ( M. K. Stalin ).. తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇక లాంఛనమే.
పద్నాలుగేళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్.. టీనేజీ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1976 ఎమర్జెన్సీ టైమ్‌లో జైలు పాలయ్యి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 1982లో డీఎంకే యువజన అధ్యక్షుడిగా ఎంపికై పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక అప్పటి నుంచి స్టాలిన్ వెనుదిరిగి చూసుకోలేదు. 1984లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగినప్పటికీ అందులో ఓడిపోయారు. 1989లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996 నుంచి వరుసగా మూడుసార్లు, కొలథూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యలో ఎన్నో పదవులను చేపట్టారు.
1996లో చెన్నై మేయర్‌గా కూడా స్టాలిన్ ఎన్నికయ్యారు. మేయర్‌గా ఎన్నికైన తర్వాత సిటీ రూపురేఖలనే మార్చేశారు. నగరవాసులతో మానగర తంతై (ఫాదర్ ఆఫ్ సిటీ) అని అనిపించుకున్నారు. 2001లోనూ ఆయన్నే ప్రజలు మేయర్‌గా ఎన్నుకున్నారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న జయలలిత ప్రవేశపెట్టిన మున్సిపల్ యాక్ట్‌తో స్టాలిన్ మేయర్ పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. 2006లో ఎమ్మెల్యేగా గెలిచి.. గ్రామీణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అక్కడ కూడా తన మార్క్ పాలనను చూపించారు. సెల్ఫ్ గ్రూపులతో గ్రామీణ ప్రజలను అభివృద్ధి దిశగా నడిపించారు. ఇక 2009లో డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. 2013లో తన రాజకీయ వారసుడిగా స్టాలిన్‌ను ప్రకటించారు కరుణానిధి. అప్పటినుంచి డీఎంకే పార్టీని ముందుండి నడిపించి తండ్రి అందించిన బాధ్యతలను నెరవేర్చుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో స్నేహం కొనసాగిస్తూ అటు కేంద్రంలో కూడా తన మార్క్ రాజకీయాలను చూపించారు స్టాలిన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
Prashant Kishor : బెంగాల్లో పంతం నెగ్గించుకున్న ప్రశాంత్ కిశోర్
సాగర్ రిజల్ట్.. తండ్రి మెజార్టీని అధిగమించిన తనయుడు..
రౌండ్ల వారీగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

