కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే
ర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సొంత పార్టీ కార్యకర్త ఒకరి చెంప చెళ్లుమనిపించారు. తన భుజంపై చేయి వేశాడన్న కోపంతో విసిగించుకొన్న డీకే.. పార్టీ మున్సిపల్ సభ్యుడిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- భుజంపై చెయ్యి వేశాడని చెంపచెళ్లు
హవేరీ, మే 5: కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సొంత పార్టీ కార్యకర్త ఒకరి చెంప చెళ్లుమనిపించారు. తన భుజంపై చేయి వేశాడన్న కోపంతో విసిగించుకొన్న డీకే.. పార్టీ మున్సిపల్ సభ్యుడిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీకే శివకుమార్ శనివారం హవేరీ జిల్లాలోని సవనూర్ పట్టణంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చిన సమయంలో కార్యకర్తలు కొంత మంది నినాదాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఒకరు డీకే భుజంపై చేయి వేయగా.. కోపగించుకొన్న శివకుమార్ అతని చెంప చెళ్లుమనిపించాడు. బాధిత కార్యకర్త మున్సిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్ అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, డీకేపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. భుజంపై చేయి వేసిన పాపానికి కార్యకర్తపై డీకే చేయిచేసుకున్నారని, ఆయన ఇలా కార్యకర్తలపై దాడి చేయడం ఇదే తొలిసారి కాదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

