Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Samvidhaan Hatya Diwas : ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.
Samvidhaan Hatya Diwas : ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించిందని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు ప్రధానులుగా వ్యవహరించారని గుర్తుచేశారు.
ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించారని డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. కాగా, 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్ షా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివస్‌ను పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం పట్ల ప్రేమ ఒలకబోస్తోందని పలు సందర్భాల్లో కాషాయ నేతలు కాంగ్రెస్‌పై భగ్గుమన్నారు.
Read More :
“Anant Weds Radhika | కళ్యాణ వేదికకు అనంత్ అంబానీ పయనం”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

