DK Shivakumar | సోనియా, రాహుల్ వారించడంతో తలవంచా : డీకే శివకుమార్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం అనంతరం సిద్ధరామయ్యకు పార్టీ హైకమాండ్ సీఎం పదవిని కట్టబెట్టడం, డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ ( DK Shivakumar) అంగీకరించడంపై ఎట్టకేలకు సీనియర్ నేత పెదవివిప్పారు.
బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం అనంతరం సిద్ధరామయ్యకు పార్టీ హైకమాండ్ సీఎం పదవిని కట్టబెట్టడం, డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ ( DK Shivakumar) అంగీకరించడంపై ఎట్టకేలకు సీనియర్ నేత పెదవివిప్పారు. రామనగరలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం కావాలనే తన ఆకాంక్షను విడిచిపెట్టానని చెప్పుకొచ్చారు.
నన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు మీరంతా పెద్దసంఖ్యలో నాకు ఓట్లు వేశారు. కానీ హైకమాండ్ మరో నిర్ణయం తీసుకుంది. అగ్ర నేతలు సోనియా, రాహుల్, ఖర్గేలు ఇచ్చిన సూచనకు నేను తలవంచానని డీకే పేర్కొన్నారు. తానిప్పుడు మరింత సహనంతో వేచిచూడాల్సి ఉందని, అయితే మీ ఆకాంక్షలు మాత్రం వృధా కావని స్పష్టం చేశారు.
మే 10న జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడటంతో ప్రతిష్టంభనను తొలగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నాలుగు రోజుల తీవ్ర తర్జనభర్జనల అనంతరం సిద్ధరామయ్యవైపు మొగ్గుచూపింది. పవర్ షేరింగ్ ఫార్ములాను ప్రతిపాదించి డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించేలా ఒప్పించింది. పవర్ షేరింగ్ ఫార్ములాలో భాగంగా రెండేండ్ల తర్వాత డీకే శివకుమార్ కర్నాటక సీఎం పదవిని చేపట్టనున్నట్టు సమాచారం.
Read More
Odisha Train Accident | ప్రమాదం జరగడానికి కారణం అదే.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

