Diwali special crackers| కండ్లు జిగేల్మనే రంగురంగుల కాంతులు వెదజల్లే పటాకులు, ఢాం.. ఢాం అనే శబ్ధాలు లేకపోతే దివ్వెల పండుగ సంపూర్ణం కాదన్నది వాస్తవం. ఇదే సమయంలో పర్యావరణ కాలుష్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవడం అవసరం. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు పటాకులపై నిషేధం విధించాయి. అయితే, పర్యావరణానికి హాని కలిగించకుండానే.. మిరుమిట్లు గొలిపే పటాకులను ఎంచక్కా కాల్చుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? అవే.. ఎలక్ట్రానిక్ పటాకులు (ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ లేదా ఈ-క్రాకర్స్).
ఎలా పనిచేస్తాయి?
ఈ-క్రాకర్స్‌లో చిన్న పాడ్స్ (బుడ్డీలు) ఉంటాయి. ఇవి ఒకదానికొకటి వైర్లతో కలిసి ఉంటాయి. వీటికి ఎల్ఈడీ బల్బులు అమర్చుతారు. ఎప్పుడైతే ఈ-క్రాకర్స్‌ను ప్లగ్‌కు అనుసంధానించి స్టార్ట్ చేస్తామో.. నిజమైన పటాకులు వెదజల్లే వెలుగులను ఈ ఎల్ఈడీ బల్బులు ప్రసరింపజేస్తాయి. రిమోట్‌తో అనుసంధానమై ఉండటం వల్ల భిన్నమైన రంగులు, డిజైన్లు, సౌండ్లను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. వేడుకలు, సినీ కార్యక్రమాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.
ఏమిటీ ఈ-క్రాకర్స్?
నిజమైన పటాకుల శబ్ధాలకు ఏమాత్రం తీసిపోకుండా.. భిన్నమైన సౌండ్లను చేస్తూ.. మిరుమిట్లు గొలిపే కాంతులను వెదజల్లే రిమోట్ కంట్రోలింగ్ స్మార్ట్ డివైజ్‌లనే ‘ఈ-క్రాకర్స్’గా పిలుస్తారు.
చాలా లాభాలున్నాయి
ఈ-క్రాకర్స్‌తో పర్యావరణ కాలుష్యం సమస్య ఉండదు. ఇవి విడుదల చేసే శబ్ధాలను కూడా నియంత్రించవచ్చు. కాల్చేవారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ‘మిరుగులు పడుతాయి, శరీరం కాలుతుంద’న్న భయమూ ఉండదు.
ఖరీదు ఎంత?
ఈ-క్రాకర్స్ ధర రూ.2,500. మార్కెట్లు, ఈ-కామర్స్ సైట్లలో కొనుగోలు చేయొచ్చు. ఒక్కో ఈ-క్రాకర్ మూడేండ్లపాటు పనిచేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Diwali Special | నరకాసురుడికి అంతశక్తి ఎక్కడిది? అతని పుట్టుక వెనుక ఉన్న చరిత్ర తెలుసా?
Diwali Harathi | దీపావళి నాడు ఆడపడుచులు ఇంట్లో వాళ్లకు హారతులు ఎందుకు ఇస్తారు?
Diwali special | ఇంట్లో దక్షిణం వైపు దీపం ఎందుకు పెట్టాలి?
Govardhanotsavam | కార్తీక మాసంలో గోవర్ధన పూజ ఎందుకు చేస్తారో తెలుసా
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?