Viral Video : నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ అమెరికా పర్యటనకు ముందు ఇండియన్ స్వీట్ డిష్ తయారుచేస్తూ నెట్టింట సందడి చేశాడు. వైరల్ క్లిప్‌లో దిల్జిత్ దోసాంజ్ తన కుకింగ్ స్కిల్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
మరో ఫుడీ వీడియోతో దోసాంజ్ నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఈ వైరల్ వీడియోలో దోసాంజ్ సంప్రదాయ పంజాబీ స్వీట్ డిష్ పంజిరి తయారుచేశాడు. రానున్న తన కన్సర్ట్కు ఇప్పటికే 20000 టికెట్స్ బుక్ అయ్యాయని ఈ వీడియోలో దిల్జిత్ చెబుతుండటం వినిపిస్తుంది.
సింగర్ మొత్తం వంటకాన్ని నెయ్యితో చేయడం ఆకట్టుకుంటుంది. డిష్‌కు మరింత స్వీట్నెస్ కోసం దోసాంజ్ బ్రౌన్ షుగర్‌ను జోడించడం చూడొచ్చు. ఆపై అన్ని పదార్ధాలను సరైన రీతిలో మిక్స్ చేయడం కనిపిస్తుంది.
Read More :