Dilip Ghosh: మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన దిలీప్ ఘోష్
Dilip Ghosh: దిలీప్ ఘోష్ సారీ చెప్పారు. దీదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. మమతా బెనర్జీపై ఇటీవల దిలీప్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని బీజేపీ కోరడంతో దిలీప్ దిగి వచ్చారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి.. ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్(Dilip Ghosh) క్షమాపణలు తెలిపారు. మమతా బెనర్జీపై రెండు రోజలు క్రితం దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ పార్టీ ఆయన నుంచి వివరణ కోరింది. తన పార్టీలో తన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, ఒకవేళ ఎవరినైనా ఇబ్బందిపెడితే, తాను సారీ చెబుతున్నట్లు దిలీప్ ఘోష్ తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన దిలీప్‌పై టీఎంసీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేసింది. సీఎం దీదీతో తనకు ఎటువంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని అన్నారు. మమతా బెనర్జీ చేసిన రాజకీయ ప్రకటనలను మాత్రమే తాను వ్యతిరేకించినట్లు దిలీప్ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ.. బెంగాల్‌కు స్థానిక వ్యక్తే కావాలని నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి కౌంటర్‌గా ‘గోవాకు వెళ్లినప్పుడు తాను గోవా బిడ్డను అని చెప్తారు. త్రిపురలో త్రిపుర బిడ్డను అంటారు. ముందు ఆమె ఎవరి కూతురు అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి’ అని ఘోష్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

