Go First: వెంటనే టికెట్లు అమ్మడం ఆపేయండి.. గోఫస్ట్‌కు డీజీసీఏ ఆదేశాలు
Go First: డీజీసీఏ ఇవాళ గో ఫస్ట్ విమాన సంస్థకు షోకాజు నోటీసులు జారీ చేసింది. సురక్షితంగా, సమర్థవంతంగా, నమ్మకమైన రీతిలో సేవలు అందించడం లేదని ఆ సంస్థను నిలదీసింది. వెంటనే విమాన బుకింగ్స్‌ను నిలిపివేయాలని, మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఎటువంటి టికెట్లను అమ్మరాదు అని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొన్నది.
న్యూఢిల్లీ: విమాన నియంత్ర సంస్థ డీజీసీఏ ఇవాళ గో ఫస్ట్(Go First) విమాన సంస్థకు షోకాజు నోటీసులు జారీ చేసింది. సురక్షితంగా, సమర్థవంతంగా, నమ్మకమైన రీతిలో సేవలు అందించడం లేదని ఆ సంస్థను నిలదీసింది. వెంటనే విమాన బుకింగ్స్‌ను నిలిపివేయాలని, మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఎటువంటి టికెట్లను అమ్మరాదు అని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొన్నది.
షోకాజు నోటీసుపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని డీజీసీఏ తెలిపింది. ఆ వివరణ ఆధారంగానే గోఫస్ట్ విమాన ఆపరేషన్స్‌కు సర్టిఫికేట్ వస్తుందని పేర్కొన్నది. మే 15వ తేదీ వరకు ప్రయాణికుల టికెట్లను అమ్మడం నిలిపివేయాలని గోఫస్ట్‌కు ఇటీవల డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాదు మే 12వ తేదీ వరకు ఆ సంస్థకు చెందిన అన్ని ఫ్లయిట్లను రద్దు చేశారు.
వాడియా గ్రూపునకు చెందిన గోఫస్ట్ సంస్థను గతంలో గోఎయిర్‌గా పిలిచేవారు. స్వచ్ఛంధ దివాళా కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఆ కంపెనీ దరఖాస్తు చేసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DGCA
- Go First
- Ticket Sales
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

